Yuzvendra Chahal | భారత స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) – ధనశ్రీ వర్మ (Dhanashree Verma) జంట విడాకులు తీసుకోబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విడాకుల పుకార్ల మధ్య చాహల్ తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. తనను క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టాడు. అయితే.. ఆ పరిస్థితులు ఏంటన్నది ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది. ఈ క్రమంలో ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read..
“Yuzvendra Chahal | మరో స్టార్ జంట విడాకులు..? ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో..!”
“Yuzvendra Chahal | నిజం ఎప్పటికైనా గెలుస్తుంది.. విడాకుల రూమర్స్‌పై స్పందించిన ధనశ్రీ వర్మ”
“కావచ్చు.. కాకపోవచ్చు.. విడాకులపై స్పందించిన చాహల్”
“RJ Mahvash | యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన ఆర్జే మహ్వాష్”