న్యూఢిల్లీ: ఐపీఎల్ క్రికెటర్లు పదేపదే తప్పు చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal) తాజాగా విమానంలో ఈ-సిగరేట్ తాగాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పంజాబ్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ వ్లోగ్‌లో ఆ వీడియో ఉన్నట్లు తెలిసింది. ఐపీఎల్లో ఆడేందుకు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో.. చాహల్ వేపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు చెందిన ఒరిజినల్ వీడియోను వ్లాగ్ నుంచి తీసివేసినట్లు తెలుస్తోంది.
యజువేంద్ర చాహల్ ధూమపానం చేస్తున్న వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో అతని ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. విమానంలో సిగరెట్ తాగి అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చాడని కొందరన్నారు. ఇండిగో అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఈ-సిగరెట్లు కానీ, వేపింగ్ కానీ అనుమతి లేదు. క్యాబిన్ బ్యాగేజీ లేదా చెకిన్ లాగేజీల్లో కూడా ఆ పరికరాలను ఉండనివ్వరు. విమానాల్లో వాటిని ప్రమాదకర వస్తువులుగా పరిగణిస్తారు.
ఇటీవల డ్రెస్సింగ్ రూమ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ధూమపానం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రవర్తనా నియమావళి కింద పరాగ్‌కు ఫైన్ వేశారు.
Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀
This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr
— Sonu (@Cricket_live247) May 7, 2026