ముంబై: టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గత నెల 5న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న చాహల్-ధనశ్రీకి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. విచారణ నిమిత్తం ఈ ఇద్దరూ మధ్యాహ్నం బాంద్రా న్యాయస్థానానికి హాజరవగా వీరికి కోర్టు విడాకులు ఇచ్చిందని చాహల్ తరఫు న్యాయవాది నితిన్ గుప్తా వెల్లడించారు. భరణం కింద చాహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా అందులో ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం.