ముంబై: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కుమారుడిని చూశారా? ముంబైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఆ పిల్లోడు కనిపించాడు. యువీ భార్య హేజిల్ కీచ్ తన కొడుకును ఎత్తుకుని ఆ మ్యాచ్‌ను వీక్షించింది. మూడేళ్లు పూర్తి అయిన ఆ పిల్లవాడిని స్టేడియంకు తీసుకు వచ్చినట్లు హేజిల్ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఐఎంఎల్ టీ20 లీగ్‌ను తల్లీకొడుకులు కలిసి వీక్షించారు. ఆ సమయంలో క్రికెట్ గురించి తన చిన్నారికి వివరించినట్లు ఆమె చెప్పింది. క్రికెట్ అంటే ఏంటీ, ఫోర్ ఏంటి, సిక్స్ ఏంటో చెప్పినట్లు పేర్కొన్నది.
ఐఎంఎల్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు తరపున యువీ ఆడాడు. ఆ జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంక మాస్టర్స్ జట్టుకు కుమార సంగక్కర సారధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో యువీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. డీప్‌లో లంక బ్యాటర్ తిరుమణే ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేసి పట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో యువీ 31 రన్స్ స్కోర్ చేశాడు. సచిన్ జట్టు 4 రన్స్ తేడాతో విజయం సాధించింది. 68 రన్స్ చేసి స్టువర్ట్ బిన్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా మాస్టర్స్ 222/4 స్కోర్ చేయగా, లంకను 218/9 రన్స్‌కే నిలువరించారు.