ముంబై : ఇండియన్ మాస్టర్స్ జట్టు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్లో వెసిండీస్ను ఓడించి టైటిల్ ఎగురేసుకుపోయింది. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే రాయ్‌పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓ చేదు ఘటన చోటుచేసుకున్నది. భారత బ్యాటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh), వెస్టిండీస్ ఫీల్డర్ టీనో బెస్ట్ వాగ్వాదానికి దిగారు. చేజింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. యువీ, బెస్ట్‌లు.. ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. ఆ సమయంలో అంబటి రాయుడు, బ్రియాన్ లారాలు వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. అంపైర్ బిల్లీ బౌడెన్ జోక్యం చేసుకుని గొడవను ఆపేశారు.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 రన్స్ మాత్రమే చేసింది. డ్వెయిన్ స్మిత్ 45, సిమ్మన్స్ 57 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, నదీమ్ రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే 149 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియన్ మాస్టర్స్ జట్టు ఈజీగా విక్టరీ అందుకున్నది. తొలి వికెట్‌కు సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు 67 రన్స్ జోడించారు. ఈ మ్యాచ్‌లో సచిన్ 25, రాయుడు 74 రన్స్ చేశారు.
Lafda with Yuvraj vs Tino best ☠️ #IMLT20Final #YuvrajSingh #IMLT20
— CricFreak69 (@Twi_Swastideep) March 16, 2025