Yuvraj Singh : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఇంకో యాభై రోజులే ఉంది. శ్రీలంకతో సంయుక్తంగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఫిఫ్టీ డేస్ టు గో అనే థీమ్‌తో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన విలువైన సందేశాన్ని ఇచ్చాడు. సమిష్టిగా ఆడి విజేతగా నిలవాలని సూచించిన యూవీ అందుకు ఒక గోల్డెన్ రూట్ పాటించాలని చెప్పాడు. ఈ నిబంధనను గనుక పాటిస్తే కప్ మనదేనని కౌర్ బృందంలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడీ వెటరన్ ప్లేయర్.
సొంతగడ్డపై వరల్డ్ కప్ లాంటి టోర్నీలు కొంతమేర ఒత్తిడిని పెంచుతాయి. కానీ, ప్రస్తుత భారత మహిళల జట్టు మంచి ఫామ్‌లో ఉంది. వరుసగా ఐదు సిరీస్‌లు గెలుపొంది ఫుల్‌జోష్‌తో వరల్ కప్ వేటకు సిద్ధమవుతోంది. సో.. ‘ఫిఫ్టీ డేస్ టు గో’ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ ప్రపంచ కప్ విజేతగా తన అనుభవాలను పంచుకుంటూ గేమ్ ఫార్ములాను మహిళా క్రికెటర్లకు తెలియజేశాడు. ‘చరిత్ర సృష్టించే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. అలా అనీ తొలి మ్యాచ్ నుంచే అది సాధ్యం అవుతుందని కాదు. కాబట్టి.. మేమే విజేతలం అని మీరు గట్టిగా నమ్మాలి. జట్టు మొత్తంలో ఆ భావన నిండాలి.
🏏✨ 50 days to go!
ICC Chairman Jay Shah, legends Yuvraj Singh & Mithali Raj, along with our India Women’s team, come together to celebrate women’s cricket as we gear up for the Women’s ODI World Cup starting September 30.💪🇮🇳#WomensCricket #CWC2025 #TeamIndia #ODIWorldCup… pic.twitter.com/Y4BIlmcwQw
— Doordarshan Sports (@ddsportschannel) August 11, 2025
అయితే.. ఛాంపియన్లం మేము అన్న ధోరణితో ప్రతి మ్యాచ్ ఆడాలి. అంతేతప్ప ఫలితం గురించి ఆందోళన చెందవద్దు. అభిమానులు ఎల్లప్పుడూ ఫోర్లు, సిక్సర్లు లేదంటే వికెట్లు పడాలని కోరుకుంటారు. క్రికెట్ అంటే అదే కదా. వరల్డ్ కప్ గెలవాలంటే మానసిక దృక్ఫథం కూడా ముఖ్యమే. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకూ ఒకటే ద్రుఢచిత్తంతో ఉండాలి. ఈ క్రమంలో ఒక్కోసారి ఒత్తిడి దరిచేరుతుంది. అలాంటప్పుడు స్వీయ నమ్మకం కోల్పోవద్దు. ఈ రోజు నేను మ్యాచ్ విన్నర్ అనే ధోరణి కనబరచాలి. మైదానంలోకి దిగిన ప్రతిసారి ఇదే వైఖరితో ఆడాలి. టోర్నీ ఆసాంతం ఈ గోల్డెన్ రూట్ పాటించారంటే కప్ మనదే’ అని యువరాజ్ తన ప్రసంగాన్ని ముగించాడు. టీమిండియా గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన యూవీ.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025’ .. ఇవాళ్టి నుంచి సరిగ్గా 50 రోజుల్లో అంటే సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్ మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2016లో భారత్‌లో మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా 1978, 1997, 2013లో భారత్ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది.