భువనేశ్వర్ : భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కాంటినెంటల్ టూర్ టోర్నీలో తెలంగాణ యువ అథ్లెట్ గందె నిత్య పతక జోరు కనబరిచింది. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును 11.70సెకన్లలో పూర్తి చేసిన నిత్య కాంస్యం ఖాతాలో వేసుకుంది.
అదే దూకుడు కొనసాగిస్తూ 200మీటర్ల రేసును 24.11సెకన్లలో ముగించి రజతాన్ని సొంతం చేసుకుంది.