హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ షట్లర్ మేఘన రెడ్డి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సిరీస్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఉగాండా వేదికగా జరిగిన టోర్నీలో మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన మేఘన సత్తాచాటింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో మేఘన 21-18, 19-21, 21-17తో విక్టోరియా (పోలాండ్)పై విజయం సాధించింది.
తొలి గేమ్ సులువుగా గెలుచుకున్న మేఘన రెండో గేమ్‌లో పోరాడి ఓడినా.. మూడో గేమ్‌లో తిరిగి పుంజుకుంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీలక పాయింట్లు సాధిస్తూ విజేతగా నిలిచింది.