చెన్నై: మెకో ఎఫ్ఎమ్ఎస్సీఐ జాతీయ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో యువ రేసర్ కియాన్ షా అదరగొట్టాడు. సోమవారం జరిగిన రేసులో టీమ్ రాయో రేసింగ్ తరఫున బరిలోకి దిగిన కియాన్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ ఎరీనా(ఎమ్ఐకేఏ)లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.
ట్రాక్‌పై ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన కియాన్ (50.530సె) పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించాడు. చెన్నైకి చెందిన శివాన్ కార్తీక్ (50.67సె), ఇషాంత్ వెంకటేశన్ (50.73సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.