హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టూర్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రష్మిక క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్ పోరులో రష్మిక 6-2, 7-5తో యనాన్ హౌ(చైనా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన రష్మిక..ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన లీగ్ పోరులోనూ ఈ యువ ప్లేయర్ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది.