హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) బి-డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్లో సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ టీమ్ 272 పరుగుల తేడాతో న్యూబ్లూస్పై ఘన విజయం సాధించింది. బుధవారం ముగిసిన పోరులో యువ పేసర్ కౌశిక్ యాట్కరి(9/50) ధాటికి న్యూబ్లూస్ టీమ్ 24 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది.
కౌశిక్ పేస్ ధాటికి న్యూబ్లూస్ టీమ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేసిన కౌశిక్ 50 పరుగులిచ్చుకుని 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యువ పేసర్ విజృంభణతో రిత్విక్రాజ్సింగ్(53), సమీర్(42) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తొలుత సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ టీమ్ 78 ఓవర్లలో 387/5 స్కోరు చేసింది.