బిష్కెక్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్లు అమన్ సెహ్రావత్, ముకుల్ దహియా రజత పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన పురుషుల 61కిలోల కేటగిరీ ఫైనల్లో అమన్ 10-13తో క్వాంగ్ ముయాంగ్ కిమ్(కొరియా) చేతిలో పోరాడి ఓడాడు.
మరోవైపు పురుషుల 86కిలోల తుది పోరులో ముకుల్ 0-7తో కమ్రాన్ జీ గసెమ్పౌర్(ఇరాన్)పై ఓటమిపాలయ్యాడు.