బెగా(ఆస్ట్రేలియా): ఎన్ఎస్డబ్ల్యూ బెగా ఓపెన్లో భారత యువ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ 10-12, 11-5, 11-5, 10-12, 11-7తో నౌర్ ఖఫాగె (ఈజిప్టు)పై అద్భుత విజయం సాధి ంచింది. 54 నిమిషాల్లోనే ముగిసిన పోరులో అనాహత్ అద్భుత పోరాట పటిమ కనబరిచింది.
టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్న పిన్న వయసు భారత ప్లేయర్గా నిలిచిన 17 ఏండ్ల అనాహ త్ ఆదివారం జరిగే ఫైనల్లో ఈజిప్టుకు చెందిన హబిబా హనితో తలపడు తుంది. సెమీస్ సందర్భంగా గాయ పడ్డ అనాహత్ వెంటనే తేరు కుని మ్యాచ్ను తన వశం చేసుకుంది. ఢిల్లీ కి చెందిన ఈ యువ ప్లేయర్ గత 18 ఈవెంట్లలో 12 పీఎస్ఏ టైటిళ్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.