మార్కమ్ (కెనడా) భారత యంగ్ షట్లర్లు ఆకర్షి కశ్యప్, తన్య హేమంత్ కెనడా ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి 21-14, 21-12తో నాలుగో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను ఓడించగా.. మరో మ్యాచ్‌లో తన్య 21-16, 21-18తో అమెరికాకే చెందిన దిశా గుప్తాపై విజయం సాధించింది.
కానీ, ఐదో సీడ్ దేవికా సిహాగ్ 14-21, 15-21తో తుంగ్ కియొవు టాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, రక్షిత రామ్రాజ్ 21-15, 14-21, 15-21తో రాచెల్ చాన్ (కెనడా), శ్రీయాన్షి 9-21, 18-21తో హువాంగ్ చింగ్ (తైపీ) చేతిలో ఓడిపోయారు… అన్మోల్ ఖర్బ్ 6-21, 26-24, 13-21తో టాప్ సీడ్ మిచెల్లీ లి (కెనడా)కు తల వంచింది. మెన్స్ సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ గాయంతో తొలి గేమ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సనీత్ దయానంద్, శంకర్ సుబ్రమణ్యం, డబుల్స్‌లో అచ్యుతాదిత్య-అర్జున్ రెడ్డి తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు.