కుమమొటొ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సేన్.. 21-13, 21-17తో లోహ్ కీన్ యు (సింగపూర్)ను మట్టికరిపించాడు.
తనకంటే మెరుగైన ర్యాంకు (9) కల్గిన కీన్ యుతో జరిగిన పోరును అతడు 40 నిమిషాల్లోనే ముగించాడు.