జకార్త: ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ దేవికా సిహాగ్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో దేవిక 11-21, 9-21తో మాజీ ప్రపంచ చాంపియన్ నజోమి ఒకుహర(జపాన్) చేతిలో ఓటమిపాలైంది.
గత ఆగస్టులో మలేషియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్ గెలిచిన ఈ 20 ఏండ్ల యువ షట్లర్ ఫైనల్లో సత్తాచాటలేకపోయింది. ఇదే టోర్నీలో పుయి చీ వా, లీ సో యుయి , ఇషికా జైస్వాల్‌పై అద్భుత విజయాలు సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.