వాంటా(ఫిన్లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ కర్బ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 10-21, 13-21తో మూడు సార్లు ప్రపంచ చాంపియన్ అకానె యమగుచి చేతిలో ఓడింది. 29 నిమిషాల్లోనే ముగిసిన పోరులో 18 ఏండ్ల అన్మోల్ దీటైన పోటీనివ్వలేకపోయింది.
2024 ఆసియా టీమ్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత జట్టు సభ్యురాలైన అన్మోల్..యమగుచితో మ్యాచ్లో ఆదిలో ఆధిపత్యం ప్రదర్శించినా అదే దూకుడు కొనసాగించలేకపోయింది. సెమీస్కు చేరుకునే క్రమంలో తన కంటే మెరుగైన ర్యాంకింగ్స్లో ఉన్న చీ హుసు(32), లిన్ సాంగ్ తీ(21) లాంటి వారిపై అన్మోల్ అద్భుత విజయం సాధించింది.