గువహటి: యువ భారత షట్లర్ అన్మోల్ ఖర్బ్ గువహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అన్మోల్తో పాటు పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్, మహిళల డబుల్స్‌లో అశ్విని – తనీషా జోడీ సైతం ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో 17 ఏండ్ల అన్మోల్.. 21-19, 21-17తో భారత్‌కే చెందిన మాన్సి సింగ్‌ను 40 నిమిషాల్లోనే ఓడించింది. మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ భారత ద్వయం తనీషా-అశ్విని.. 21-14, 21-14తో షు లియాంగ్-వాంగ్ టింగ్ జి (చైనా)ను చిత్తు చేశారు. పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్.. 13-21, 21-14, 21-16తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో జరిగిన హోరాహోరి పోరులో విజయం సాధించాడు.