షిమ్కెంట్(కజకిస్థాన్): ఏషియన్ చాంపియన్షిప్లో శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ పసిడి పతకంతో మెరిసింది. ఎలావెనిల్ ఫైనల్లో 253.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఇదే విభాగంలో భారత షూటర్ మెహులీ ఘోశ్(208.9) నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. మహిళల జూనియర్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో శాంభవి, హృద్యశ్రీ, ఇషా పసిడి దక్కించుకుంది.