బెగా(ఆస్ట్రేలియా): ఎన్ఎస్డబ్ల్యూ స్కాష్ బెగా ఓపెన్‌లో భారత యువ ప్లేయర్ అనాహత్ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్ సందర్భంగా గాయపడ్డ అనాహత్ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ హబిబా హనీతో తుది పోరులో 1-2తో(9-11, 11-5, 11-8, 10-4)తో వెనుకంజలో ఉన్న క్రమంలో అనాహత్ గాయం బారిన పడింది.
వరల్డ్ ఈవెంట్స్ ఫైనల్లో తొలిసారి బరిలోకి దిగిన అనాహత్ తొలి గేమ్‌ను 11-9తో కైవసం చేసుకుని దూకుడు మీద కనిపించింది. అయితే ఒక్కసారిగా పుంజుకున్న హనీ 11-5, 11-8తో రెండు గేమ్‌లు కైవసం చేసుకుంది. ఫైనల్‌కు ముందు జరిగిన వేర్వేరు గేముల్లో ఈ 17 ఏండ్ల యువ ప్లేయర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.