దుబాయ్: వన్డే ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరువయ్యాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 829 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్మన్తో పాటు టీమ్ఇండియా నుంచి కోహ్లీ (6), రోహిత్ (8) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ రెండో ర్యాంక్‌కు చేరాడు.