చెన్నై: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే క్లాసికల్ రేటింగ్స్‌లో కెరీర్లోనే అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఫిడే తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ చెన్నై చిన్నోడు.. 2785 ఎలో రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకాడు. క్లాసికల్ విభాగంలో భారత్ తరఫునా ఇదే హయ్యస్ట్ ర్యాంకింగ్. చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (2839) అగ్రస్థానంలో కొనసాగుతుండగా అమెరికా ఆటగాళ్లు హికారు నకముర (2,810), ఫాబియానొ కరువాన (2,789) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇటీవలే ముగిసిన సింక్ఫీల్డ్ కప్‌లో రెండో స్థానంతో ముగించడం ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. భారత ఆటగాళ్లలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి (2,771 పాయింట్లు) ఐదో స్థానంలో ఉండగా వరల్డ్ చాంపియన్ గుకేశ్ (2,767) ఆరో స్థానంలో నిలిచాడు.