బ్యాంకాక్ : ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ రితిక స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 80+కిలోల ఫైనల్ బౌట్లో రితిక..అస్సెల్ తోక్సాన్(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన రితిక పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది.
రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు 57కిలోల తుది పోరులో యాత్రి పటేల్.. ఖుమోరబోను మమాజనోవా(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తి పడింది. 60కిలోల టైటిల్ ఫైట్‌లో ప్రియ 2-3 తేడాతో యు తియాన్(చైనా) చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచింది.