లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన జాస్మిన్..వెనిజులా బాక్సర్‌పై పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది.
రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన జాస్మిన్..తుదిపోరులో నిలిచిన తొలి బాక్సర్‌గా నిలిచింది. మరోవైపు మహిళల 48 కిలోల క్వార్టర్స్‌లో మీనాక్షి.. 5-0తో ఇంగ్లండ్ బాక్సర్ అలీస్ పంఫెరిపై గెలిచిసెమీస్కు వెళ్లికాంస్య పతకం ఖాయం చేసింది. ఇప్పటికే నుపుర్, పూజారాణి సెమీస్ చేరగా, పురుషుల విభాగంలో జాదుమనిసింగ్ ఓటమితో 12 ఏండ్ల తర్వాత ఒక్క పతకం లేకుండానే భారత్ తమ పోటీని ముగించింది.