డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల 120కి.మీల రోడ్ సైక్లింగ్ ఈవెంట్లో యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసులో ఆశీర్వాద్ (2:48:39సె) మూడో స్థానంలో నిలువగా, ఎస్ఎస్సీబీకి చెందిన దినేశ్, సాహిల్కుమార్ వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. పతకాల పట్టికలో తెలంగాణ ప్రస్తుతం 23వ స్థానంలో కొనసాగుతున్నది.