Priyajit Ghosh : క్రికెట్టే సర్వస్వం అనుకున్న యువ క్రికెటర్ ప్రియజిత్ ఘోష్ (Priyajit Ghosh) జీవితం విషాదంతమైంది. భావి తారగా ఎదుగుతున్న అతడు హఠాత్తుగా గుండెపోటు (Heart Attack)తో తనువు చాలించాడు. బెంగాల్ క్రికెటర్ అయిన ప్రియజిత్కు శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో, అతడు ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ప్రియజిత్ మరణ వార్త తెలిసిన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
బోలాపూర్లోని బిర్బుమ్ జిల్లాలో నివసించేవాడు ప్రియజిత్. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్న అతడు గొప్ప ప్లేయర్ అవ్వాలనుకున్నాడు. జిల్లా స్థాయిలో అదిరే బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు ప్రయజిత్. 2018-19లో బెంగాల్ క్రికెట్ సంఘం నిర్వహించిన అండర్-16 అంతర్జాతీయ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా అవార్డు, మెడల్ అందుకున్నాడు.
Tragedy has struck the cricket world! Bengal’s rising star, Priyajit Ghosh, passed away at just 22 years old due to a heart attack during a gym session. This talented cricketer’s life journey ended abruptly on Friday morning, leaving friends, relatives, and teammates in mourning.… pic.twitter.com/Ex1s7E08W2
— IndiaToday (@IndiaToday) August 2, 2025
అదే జోష్‌తో దేశవాళీలో బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఆడాలని.. ఆపై టీమిండియా జెర్సీ వేసుకోవాలని ఎన్నో పెద్ద పెద్ద కలలు కన్నాడీ యంగ్‌స్టర్. ఫిట్‌గా ఉండేందుకు నిత్యం జిమ్‌కు వెళ్లే ప్రియజిత్ శుక్రవారం కూడా యథావిధిగా వర్కవుట్లు చేయసాగాడు. కానీ.. ఛాతీలో నొప్పితో అతడు కిందపడిపోయాడు. గుండెపోటు కారణంగా అతడు అవేవీ నెరవేరకుండానే అర్దాంతరంగా తన జర్నీని ముగించడం బాధాకరం.