ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శిక్షణనిస్తే అతడిని మరో క్రిస్ గేల్ (వెస్టిండీస్)లా తయారు చేస్తాడని యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్‌కు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు.
దేశవాళీలోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో యోగ్రాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘నేను అర్జున్‌కు అతడి బౌలింగ్ కంటే బ్యాటింగ్ మీద ఎక్కువ దృష్టి సారించమని చెప్పా. ఒకవేళ సచిన్ గనక తన కొడుకును యువరాజ్ దగ్గర శిక్షణ ఇప్పిస్తే అతడు మరో గేల్ అవుతాడని నేను పందెం వేసి చెప్పగలను.
ఒక పేసర్ తరుచుగా ఒత్తిడికి గురైతే అతడు సమర్థవంతంగా బౌలింగ్ చేయలేడు’ అని యోగ్రాజ్ అన్నాడు. అర్జున్ గతంలో యోగరాజ్ వద్ద కొన్ని రోజులు శిక్షణ పొందిన విషయం విదితమే. ప్రస్తుతం భారత టీ20 జట్టులో మెరుపులు మెరిపిస్తున్న అభిషేక్ శర్మ.. యువీ వద్ద శిక్షణ పొందినవాడే.