లండన్ : ప్రఖ్యాత లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా (158 బంతుల్లో 113, 14 ఫోర్లు) లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు శతకం చేయగా సెకండ్ ఇన్నింగ్స్‌ను భారత్ 341/7 వద్ద డిక్లేర్డ్ చేసింది.
154/1తో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. స్మృతి (70) వికెట్ త్వరగానే కోల్పోయినా యస్తికా, రిచా ఘోష్ (50 నాటౌట్) రాణించడంతో ప్రత్యర్థి ఎదుట 457 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలిపింది. భారీ ఛేదనలో మూడో రోజు ఆట చివరికి ఇంగ్లిష్ జట్టు.. 40 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. అమీ జోన్స్ (52 బ్యాటింగ్) ఆ జట్టును ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 327 రన్స్ చేయాలి.