Yastika Bhatia : భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా (Yastika Bhatia) చిరస్మరణీయి శతకంతో జట్టుకు భారీ స్కోరందించింది. లార్డ్స్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టిన యస్తికా.. లంచ్ తర్వాత సెంచరీ అందుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ వికెట్ కీపర్, బ్యాటర్‌కు ఇదే మొదటి వంద కావడం విశేషం.
టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీతో యస్తికా భాటియా రికార్డులు నెలకొల్పింది. మూడో/నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ కొట్టిన భారత మహిళా క్రికెటర్‌గా యస్తిక గుర్తింపు సాధించింది. ఇదివరకు సంధ్యా అగర్వాల్ చేసిన 98 పరుగులే మూడో/నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా ఉండేది. 1985లో లక్నో వేదికగా న్యూజిలాండ్‌పై సంధ్య అర్ధ శతకంతో ఈ రికార్డు సృష్టించింది. మూడో అత్యధిక స్కోర్ 83 (వాంఖడేలో ఆస్ట్రేలియాపై 1984లో) కూడా ఆమె పేరిటే ఉండడం విశేషం.
A historic hundred from Yastika Bhatia!
The first woman to put her name on the Test batting honours board at Lord’s ✨ pic.twitter.com/i0MIIjsxsn
— Cricinfo (@cricinfo) July 12, 2026
1. యస్తికా భాటియా(113) vs ఇంగ్లండ్, లార్డ్స్‌లో – 2026
2. సంధ్యా అగర్వాల్ (98) vs న్యూజిలాండ్, లక్నో – 1985
3. సంధ్యా అగర్వాల్(83) vs ఆస్ట్రేలియా, వాంఖడేలో – 1984
4. స్నేహ్ రానా (80 నాటౌట్) vs ఇంగ్లండ్, బ్రిస్టొల్ – 2021
5. గార్గి బెనర్జీ (75) vs ఇంగ్లండ్, బ్లాక్పూల్ – 1986
6. గార్డి బెనర్జీ(72) vs ఆస్ట్రేలియా, వాంఖడే – 1984
One that she will remember for a long long time 🤩
📸 📸 The moment Yastika Bhatia got to a 𝗺𝗮𝗴𝗻𝗶𝗳𝗶𝗰𝗲𝗻𝘁 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 🥳
Updates ▶️ https://t.co/O1rEau8j8n #TeamIndia | #ENGvIND | @YastikaBhatia pic.twitter.com/eZunhKpSrp
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన యస్తిక.. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజునంటుకొని జట్టు ఆధిక్యాన్ని పెంచుతూ పోయింది. స్మృతి మంధాన(70), దీప్తి శర్మ(10)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆమె జోరుతో భారత జట్టు ఆధిక్యం నాలుగొందలు దాటింది.