ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. చెన్నై యువప్లేయర్ రుతురాజ్ సెంచరీ వృథా చేస్తూ రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 21 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత శివమ్ దూబే (64) కూడా రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది.
ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం యశస్వి తన అభిమాన ప్లేయర్ ధోనీని కలిశాడు. తన బ్యాటుపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మ్యాచ్ తర్వాత నా బ్యాటుపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని యశస్వి చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.