Yashasvi Jaiswal : ప్రతిభకు, పరుగులకు కొదవలేకున్నా యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. ఒకే ఫార్మాట్ ప్లేయర్‌గా అదరగొడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బాలీవుడ్ సల్మాన్ ఖాన్(Salman Khan) 60వ పుట్టిన రోజున ఆసక్తికర విషయం పంచుకున్నాడు. వైజాగ్ వన్డేలో సెంచరీతో జట్టును గెలిపించిన యశస్వీ.. కోహ్లీ తనను కండల వీరుడు సల్మాన్‌తో పోల్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడిన యశస్వీ జైస్వాల్ ఈమధ్య వన్డేల్లోనూ ఇన్నింగ్స్ ఆరంభించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన అతడు తొలి రెండు మ్యాచుల్లో విఫలమైనా.. చివరి వన్డేలో సెంచరీతో కదం తొక్కాడు. వైజాగ్‌లో సఫారీ బౌలర్లను కాచుకొని ఈ ఫార్మాట్లో తొలి శతకం సాధించాడు యశస్వీ. విరాట్ కోహ్లీతో కలిసి అజేయంగా జట్టుకు సిరీస్ విజయాన్ని కట్టబెట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆరోజు మైదానంలో జరిగిన విషయాల్ని ఒక యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు. ‘కోహ్లీకి హాస్య చతురత ఎక్కువ. ఆ రోజు అతడు నా హెయిర్ స్టయిల్ అచ్చం ‘తేరే నామ్’ (Tere Naam) సినిమాలో సల్మాన్ ఖాన్‌లా ఉందని అన్నాడు.
Virat Kohli teasing Yashasvi Jaiswal’s hairstyle. 🤣❤️pic.twitter.com/UJRdmZH6Y2
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 1, 2025
అంతేనా.. ‘లగాన్ లగ్ గయి రే’ అనే పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ నాతో పాటు అందరినీ నవ్వించాడు. ఆ రోజు మా ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. నేను బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు కూడా కోహ్లీ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు. అతడు చాలా సరదా మనిషి. క్రీజులో ఉన్నప్పుడు బంతికి తగ్గట్టు పొజిషన్ మార్చుకోవడం, స్ట్రయిక్ రొటేట్ చేయడం.. ఇలా ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే.. ఒక్కసారి అతడు సీరియస్‌గా మారాడంటే మ్యాచ్‌లో ఆ తీవ్రత కనిపిస్తుంది. ఆరోజు కోహ్లీతో ఆడడాన్ని నేను ఎంతో ఆస్వాదించాను’ అని యశస్వీ వెల్లడించాడు.
#BREAKING : Yashasvi Jaiswal scores his maiden ODI century, becomes 6th Indian to score tons in all formats of men’s cricket#INDvSA #indiavssa #INDvsSA3rdodi #YashasviJaiswal #ODIs #Cricket #TeamIndia pic.twitter.com/yrDcnSbvO2
— upuknews (@upuknews1) December 6, 2025
ఈమధ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో సెంచరీతో మెరిసిన ఈ యంగ్‌స్టర్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. అయినా సరే ఈ చిచ్చరపిడుగును సెలెక్టర్లు టీ20 ప్రపంచకప్ 2026 స్క్వాడ్లోకే తీసుకోలేదు.