ఓవల్ : ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jasiwal) మళ్లీ విఫలమయ్యాడు. ఓవల్‌లో జరుగుతున్న అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను కేవలం రెండు పరుగులకే నిష్క్రమించాడు. గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. ఫుల్ లెన్త్ బంతి.. నేరుగా అతని ప్యాడ్స్‌కు తగిలింది. అయితే వాస్తవానికి ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లింది. థార్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. లెగ్ స్టంప్‌ను బంతి తగులుతున్నట్లు రిప్లేలో అనిపించింది.
చివరి రెండు మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు జైస్వాల్. మాంచెస్టర్ మ్యాచ్‌లో అతను 58 స్కోర్ చేశాడు. దీని ఫలితంగా అతని టెస్టు ర్యాంకింగ్ కూడా పడిపోయింది. ప్రస్తుతం తాజా ర్యాంకింగ్స్ ప్రకారం జైస్వాల్ 8వ స్థానంలో ఉన్నాడు. 769 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానానికి దిగజారాడు.
ప్రస్తుతం 8 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టానికి 18 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ క్రీజ్‌లో ఉన్నారు.
Yashasvi Jaiswal Innings in this series.
2(9), 0(4), 58(107), 0(7), 13(8), 28(22), 87(107), 4(11) & 101(158).#YashasviJaiswal #INDVsENG#INDvsENGTest pic.twitter.com/ctpgSOxNWf
— Sanatani Panda 🟢 (@EPrody34017) July 31, 2025