మెల్బోర్న్: యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) భారత జట్టును మరోసారి ఆపద్భాందవుడయ్యాడు. స్వల్పవ్యధిలోనే సీనియర్లు ఔటై కష్టాల్లో కూరుకుపోయిన టీమ్ఇండియాను ఆదుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. ఇద్దరు యువ బ్యాటకర్లు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. ఈ క్రమంలో జైస్వాల్ అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. 40వ ఓవర్లో లైయన్ వేసిన నాలుగో బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో యశస్వీ 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది మూడోసారి.
మరో ఎండ్‌లో పంత్ నిలకడగా ఆడుతున్నాడు. 44 ఓవర్లు మగిసే సరికి భారత్ 95 రన్స్ చేసింది. ప్రస్తుతం జైస్వాల్ (57), పంత్ (17) రన్స్‌తో క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 245 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విజయం కంటే డ్రా కోసం ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నది.
Yashasvi Jaiswal hits his third 50+ score this BGT 👏
🔗 https://t.co/ycgxNhumqw | #AUSvIND pic.twitter.com/bnqwx4PJfO
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2024
A 50-run stand between Jaiswal and Pant 🤝 👀
🔗 https://t.co/ycgxNhumqw | #AUSvIND pic.twitter.com/2jOux1vKhM
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2024