IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఓపెనర్ యశస్వీ జైస్వాల్(56) దూకుడుగా ఆడుతున్నాడు. చాహల్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ బౌండరీతో అర్ద శతకం సాధించాడు. ఈ సీజన్లో యశస్వీకి ఇదే మొదటి హాఫ్ సెంచరీ. కెప్టెన్ సంజూ శాంసన్(38)తో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ లెఫ్ట్‌హ్యాండర్.. రియాన్ పరాగ్(4) జతగా విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 12 ఓవర్లకు స్కోర్.. 105-1.
ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వీ జైస్వాల్(56) ఈసారి మంచి టచ్‌లో కనిపించాడు. అనవసర షాట్లకు వెళ్లకుండా.. బౌండరీలతో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికారేశాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 53 రన్స్ కొట్టింది. శతక భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్న ఈ జోడీని లాకీ ఫెర్గూసన్ విడదీశాడు. సంజూ శాంసన్(38) గాల్లోకి లేపిన బంతి నేరుగా శ్రేయాస్ అయ్యర్ చతుల్లో పడింది. దాంతో, రాజస్థాన్ 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.