IPL 2023 : సొంత మైదానంలో రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్‌లో మూడో అర్థ సెంచరీ సాధించాడు. యశస్వీ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 రన్స్ చేశాడు. ఆరోస్థానంలో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(27), ధ్రువ్ జురెల్(34) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 202 స్కోర్ చేసింది.
మథీశ పథిరన వేసిన 20వ ఓవర్లో ధ్రువ్ జురెల్(34) దంచాడు. తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. వైడ్ అయిన నాలుగో బంతికి పరుగుకు ప్రయత్నించాడు. ధోనీ తన మార్క్ త్రోతో అతను రనౌటయ్యాడు. ఐదో బంతిని దేవ్‌దత్ పడిక్కల్(27) బౌండరీకి పంపాడు. ఆఖరి బాల్‌కు 3 రన్స్ వచ్చాయి. దాంతో, రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
Innings Break!
A solid batting performance from @rajasthanroyals! 💪 💪
The @ChennaiIPL chase to begin shortly 👍 👍
Scorecard ▶️ https://t.co/LoIryJ4ePJ#TATAIPL | #RRvCSK pic.twitter.com/8JfziU3C0q
— IndianPremierLeague (@IPL) April 27, 2023
టాస్ గెలిచిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(77) , జోస్ బట్లర్(27) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. బట్లర్‌ను ఔట్ చేసిన జడ్డూ ఈ జోడీని విడదీశాడు. తుషార్ దేశ్‌పాండే ఒకే ఓవర్లో సంజూ శాంసన్(17), యశస్వీని ఔట్ చేసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వచ్చిన హెట్మెయిర్(8) విఫలయ్యాడు.