న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు భారత స్టార్ రెజ్లర్ అంతిమ్ పంగల్(53కి) అర్హత సాధించింది. వరల్డ్ రెజ్లింగ్ టోర్నీ కోసం అర్హత పోటీల్లో అంతిమ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ భారత జట్టులో చోటు దక్కించుకుంది. 20 ఏండ్ల వయసులోనే ఇప్పటికే ఆసియా గేమ్స్, ఏషియన్ చాంపియన్‌షిప్ లాంటి టోర్నీల్లో పతకాలు సాధించిన అంతిమ్ ట్రయల్స్‌లో..
పూజ(మధ్యప్రదేశ్), హినాబెన్(గుజరాత్)కు కనీసం ఒక్క పాయింట్ కూడా చేజార్చుకుండా ట్రయల్స్‌లో విజయం సాధించింది. మరోవైపు 65కిలోల విభాగంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ వైష్ణవి పాటిల్ బెర్తు దక్కించుకుంది. మరోవైపు మనీశ(62కి), జ్యోతి(72కి), ప్రియా మాలిక్(76కి), అంకుశ్(50కి), నిశు(55కి), తపస్య(57కి), నేహా(59కి), శ్రిస్తి(68కి) మెగాటోర్నీకి బెర్తు దక్కించుకున్నారు.