న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికలు(WFI Elections) జూలై 4వ తేదీన జరగనున్నాయి. భారతీయ ఒలింపిక్ సంఘం ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించింది. ఆ ఎన్నికలకు జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు. డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలను నిర్వహించేందుకు ముందుకు వెళ్లాలని, ఆ ఎన్నికల కోసం అసిస్టెంట్ రిట్నరింగ్ ఆఫీసర్‌ను నియమించుకోవాలని జస్టిస్ మిట్టల్‌ను ఐఓఏ కోరింది.
ప్రస్తుతం రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌గా ఉన్న ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై విచారణ కొనసాగుతోంది. మహిళా అథ్లెట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు. గురువారం రోజున ట్రయల్ కోర్టు ముందు పోలీసులు తమ రిపోర్టును సమర్పించనున్నారు.