న్యూఢిల్లీ : రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ పోగట్ విదేశీ శిక్షణ శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్‌పై ఆరోపణల నేపథ్యంలో నిరసన తెలిపిన బజరంగ్, వినేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వీరిద్దరి శిక్షణ కోసం ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్) కింద ఆర్ధిక సహాయంకూడా మంజూరు చేసింది.
అయితే బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలిపిన తరువాతే తాము శిక్షణకు, టోర్నీలకు హాజరవుతామని బజరంగ్, వినేష్ తెలిపినట్టు సమాచారం. గత జనవరిలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన దీక్షలో బజరంగ్, వినేష్ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.