Wrestler Sushil Kumar : భారత స్టార్ రెజ్లర్ (Star Wrestler), ఒలింపియన్ సుశీల్ కుమార్ (Sushil Kumar) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట లభించింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్‌కు రెగ్యులర్ బెయిల్ దక్కింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ 2021లో హత్యకు గురయ్యాడు. దాంతో పోలీసులు 2021 మే నెలలో సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో కూడా సుశీల్‌కు బెయిల్ దొరికింది.
2023 జూలైలో మోకాలి శస్త్రచికిత్స కోసం ఆయనకు 7 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. మంగళవారం ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కాగా సుశీల్ కుమార్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి రజత, కాంస్య పతకాలు అందించారు. సాగర్ ధన్కర్ హత్య కేసులో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో సుశీల్ కుమార్ కూడా ఒకరిగా ఉన్నాడు.
కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద 2021 మే 4న సాగర్‌తోపాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్లపై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సుశీల్‌కుమార్‌పై, అతని స్నేహితులపైన హత్య కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.