WPL Final 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు జరుగుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, మిన్ను మని, రాధా యాదవ్.
ముంబై ఇండియన్స్ జట్టు : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), పూజా వస్త్రాకర్, మేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సైకా ఇషాక్.
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటివరకు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఆల్రౌండర్లలో ముంబై బలంగా కనిపిస్తోంది. సమిష్టిగా ఆడుతున్న ఢిల్లీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దాంతో.. కీలకమైన టైటిల్ పోరులో పైచేయి ఎవరిది? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఏ టీమ్ గెలిచినా తొలి సీజన్ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించనుంది.