WPL 2024 : టార్గెట్ ప్లేఆఫ్స్.. యూపీతో ముంబై కీలక పోరు..
WPL 2024, UP vs MI | ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి రెండింట్లో ఓడిన ముంబై.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఐదు మ్యాచ్లు ఆడి రెండు మాత్రమే గెలిచిన యూపీ వారియర్స్.. నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
WPL 2024, UP vs MI | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు కీలక మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన ముంబై.. నేడు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. యూపీ బౌలింగ్ చేయనుంది.
ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి రెండింట్లో ఓడిన ముంబై.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 8 పాయింట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి మూడింట ఓడి ఆరు పాయింట్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ముంబై, బెంగళూరు తలా ఆరు పాయింట్లతో సమానంగా ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరు (+0.038).. ముంబై (+0.018) కంటే మెరుగ్గా ఉంది. నేటి మ్యాచ్లో ముంబై.. యూపీని ఓడిస్తే ఆర్సీబీని వెనక్కినెట్టి రెండో స్థానానికి వచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడి రెండు మాత్రమే గెలిచిన యూపీ వారియర్స్.. నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే యూపీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ముంబైని ఓడిస్తే యూపీ థర్డ్ ప్లేస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ముంబై, యూపీలు గత మ్యాచ్లో ఓడిపోయాయి. లీగ్ దశ చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ఇకనుంచి జట్లన్నీ తాము ఆడబోయే ప్రతి మ్యాచ్లోనూ గెలిచేందుకు యత్నిస్తున్న తరుణంలో నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి…
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

