WPL 2024, DC vs MI | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ బదులుతీర్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్.. 29 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 193 పరుగులు ఛేదనలో ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ తడబడింది. ఢిల్లీ పేసర్ మరిజన్నె కాప్.. ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ముంబైని కోలుకోలేని దెబ్బతీసింది.
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తికా భాటియా (6)ను కాప్ బౌల్డ్ చేసింది. మరుసటి ఓవర్లో నటాలీ సీవర్ బ్రంట్ (5)ను శిఖా పాండే బౌల్డ్ చేయడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. తన మూడో ఓవర్లో కాప్.. ముంబైకి మరో షాకిచ్చింది. ఈసారి బాధితురాలు హర్మన్‌ప్రీత్ కౌర్. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్న ముంబైని ఆదుకుంటుందని ఆశించిన ఓపెనర్ హీలి మాథ్యూస్ (17 బంతుల్లో 29, 6 ఫోర్లు) కూడా జొనాసెన్ బౌలింగ్‌లో క్యాప్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అమెలియా కెర్ (17)ను టిటాస్ సాధు ఔట్ చేసింది.
68 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన ముంబైని అమన్‌జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 42, 7 ఫోర్లు) ఆదుకుంది. వేగంగా ఆడిన ఆమె.. ముంబై స్కోరు వేగాన్ని పెంచింది. కానీ జొనాసెన్ బౌలింగ్‌లో ఆమె క్లీన్ బౌల్డ్ అవడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. పూజా వస్త్రకార్ (17), సజన (14 బంతుల్లో 24 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) లు ముంబై ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు.
Largest win in WPL 2024 (by run margin)
DC won by 29 runs vs MI (today) 👈
DC won by 25 runs vs GG
DC won by 25 runs vs RCB #CricketTwitter #WPL2024 #DCvMI pic.twitter.com/Ekwb9VsJmc— Female Cricket (@imfemalecricket) March 5, 2024
ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఢిల్లీకి ఇది నాలుగో విజయం కాగా ముంబైకి ఐదు మ్యాచ్‌లలో రెండో పరాజయం. తాజా విజయంతో ఢిల్లీ.. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ముంబై మూడో స్థానానికి పడిపోయింది. ముంబైతో పాటు ఆర్సీబీకి 6 పాయింట్లతో సమానంగా ఉన్నా బెంగళూరుకు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆ జట్టు రెండో స్థానానికి దూసుకొచ్చింది.