హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి కొప్పెర సింధు సత్తాచాటింది. తుంగతుర్తిలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న సింధు..ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేసన్ వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్‌షిప్(అండర్-18) ట్రయల్స్‌కు భారత్ నుంచి ఎంపికైంది. చైనాలోని షాంగ్లు వేదికగా జూలై 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ట్రయల్స్‌లో సింధు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఇందుకోసం ఇటీవల రాయ్‌బరేలి(ఉత్తరప్రదేశ్)లో జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచిన టాప్-29 బాలికల నుంచి సింధును ఎంపిక చేశారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ, జూనియర్ కాలేజ్ పీడీ, పీఈటీ అసోసియేషన్ చైర్మన్ రామ్‌లక్ష్మణ్, అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చందర్, నీరజ..సింధును ప్రత్యేకంగా అభినందించారు.