ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా వరల్డ్ పోల్ వాల్ట్ చాంపియన్, అమెరికన్ సామ్ కెండ్రిక్స్ కరోనా బారిన పడి ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో పోటీల్లో పాల్గొనకుండానే అతను వెనుదిరగనున్నాడు. తమ అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెండ్రిక్స్ కరోనా బారిన పడ్డాడని చెప్పడానికి చింతిస్తున్నామని అమెరికా ఒలింపిక్ కమిటీ చెప్పింది.
మరోవైపు మొత్తం ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్ ఐసోలేషన్‌లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమంతా ఐసోలేషన్‌లో ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పింది. అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్‌లో ఒకరు కొవిడ్ బారిన పడినట్లు తెలియగానే ఆస్ట్రేలియా టీమంతా ఎవరి రూమ్‌లకు వాళ్లు పరిమితమైనట్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ వెల్లడించింది.