కోబ్: ప్రపంచ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. కోబ్ (జపాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం.. పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో సచిన్ సర్జీరావ్ స్వర్ణం నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 16.30 మీటర్ల దూరం విసిరిన సచిన్.. పసిడితో పాటు ఆసియా రికార్డు (గతేడాది 16.21 మీటర్లు) నమోదు చేశాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 కేటగిరీలో ధరంబీర్ రజతం గెలుచుకున్నాడు. 12 పతకాలతో భారత్.. 2023 ఎడిషన్ పతకాల(10) సంఖ్యను అధిగమించింది.