మాంటెకార్లో: మాంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-4, 5-7, 4-6తో ముసెట్టి చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు.
తొలి సెట్‌ను 6-4తో దక్కించుకున్న నోవాక్..పదహారో సీడ్ ముసెట్టీకి వరుసగా రెండు సెట్లు కోల్పోయాడు. రఫెల్ నాదల్, కార్లోస్ అల్కారజ్ గైర్హాజరీలో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన జొకో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ముసెట్టీ..క్వార్టర్స్‌లో సిన్నర్‌తో తలపడనున్నాడు.