కోల్‌కతా: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ టిక్కెట్ల రేట్లను నిర్వాహకులు ఖరారు చేశారు. చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్..మెగాటోర్నీలో ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతున్నది. ఇందులో సెమీఫైనల్ సహా ఐదు లీగ్ మ్యాచ్‌లు ఉన్నాయి. సెమీస్ మ్యాచ్‌కు కనీస టిక్కెట్ ధర రూ.900లుగా నిర్ణయించినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(సీఏబీ) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి.