World Cup Star : సమాన అవకాశాలు కల్పిస్తే ప్రతిభలో తామీమీ తీసిపోమని చాటుతున్నారు ఈ కాలం అమ్మాయిలు. ‘జెంటిల్మన్ ఆట’గా ముద్రపడిన క్రికెట్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తగిన ప్రోత్సాహం, ఆర్ధిక తోడ్పాటు లభిస్తే తమ కలను సాకారం చేసుకొని.. రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తామని నిరూపిస్తున్నారు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెటర్లలో చాలామందిది ఇలాంటి కథ. కానీ, అందరిలో కామన్ పాయింట్ ఏంటంటే.. ఫ్యామిలీ మద్దతు ఉండడం. ఫుట్‌పాత్ వ్యాపారి అయిన తండ్రి చాలీచాలని సంపాదనతో ఈ రోజు దేశం గర్వించదగ్గ ప్లేయర్‌గా మారింది రాధా యాదవ్ (Radha Yadav). చిన్నప్పుడు ‘అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతావా?’ అనే ప్రశ్నల నుంచి ‘నీ ఆట సూపర్’ అనే ప్రశంసలు అందుకుంటున్న రాధా స్ఫూర్తిదాయక ప్రస్థానమిది.
ప్రపంచకప్ ఛాంపియన్‌గా ప్రశంసలు, రివార్డులు అందుకున్న భారత మహిళా క్రికెటర్లు విజయ గర్వాన్ని ప్రదర్శించడం లేదు. మహిళల క్రికెట్టా? అనే చిన్న చూపును తుడిచేసిన శక్తులుగా గర్వపడుతున్నారు. అవును.. రాధా యాదవ్ కూడా చిన్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు తాను విశ్వ విజేతగా నిలవడానికి కుటుంబమే కారణమంటోంది తను. చిన్నప్పుడు పేదరికం కష్టాలు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు, అడుగడుగునా అండగా నిలిచిన సోదరులను మరువలేనని అంటున్న రాధ స్వరాష్ట్రం మహారాష్ట్ర. ముంబైలోని కండీవలీ (Kandiavali) ప్రాంతానికి చెందిన ఆమె.. వరల్డ్ కప్ విజేతగా ఆదివారం వడోదర చేరుకోగా అపూర్వ స్వాగతం లభించింది.
వరల్డ్ కప్ విక్టరీని ఆస్వాదిస్తున్న రాధ .. చరిత్రాత్మక వరల్డ్ కప్ విజయం, తన కుటుంబం గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘వరల్డ్ కప్ విజయం అనేది చాలా పెద్దది. టీమిండియా విశ్వ విజేతగా నిలవడం మహిళా క్రికెట్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతుందని నమ్ముతున్నా. ఒకప్పుడు మహిళా క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు ఎవరూ వచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు మాకంటూ అభిమానులు ఉన్నారు. వరల్డ్ కప్ ట్రోఫీతో ముంబై చేరుకున్నాక మాకు లభించిన అపూర్వ స్వాగతాన్ని మర్చిపోలేను’ అని రాధ తెలిపింది.
Warm welcome to Indian Women’s Cricket Team star Radha Yadav at Vadodara Airport! 🇮🇳🏏 pic.twitter.com/mwUl70fpqj
— Dr. Manisha Vakil (@manisha_vakil) November 8, 2025
‘ఫైనల్ సమయంలో దేవుడా ఈ వరల్డ్ కప్ మాకు అందివ్వు అని దేవుడుని ప్రార్ధించాను. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో మాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అందరం సర్వశక్తులు ఒడ్డాలనుకున్నాం. ప్రతిఒక్కరం వంద శాతం మెరుగ్గా ఆడాలని అనుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు ఉండడంతో అనుకున్నట్టే వరల్డ్ కప్ సాధించాం’ అని ఫైనల్ రోజును గుర్తు చేసుకున్న తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ‘మాది ముంబైలోని కండీవలీ అనే ప్రాంతం. నాన్న ఓం ప్రకాశ్ (OM Prakash) ఫుట్‌పాత్ మీద పాలు, కూరగాయలు అమ్మేవారు. నేను క్రికెట్ ఇష్టపడడం చూసి నాన్న ప్రోత్సహించారు. సోదరులు మోను, దీపక్‌లు ప్రోత్సహించడమే కాదు నాకు బౌలింగ్ చేసేవారు. మా సోదరి సోని కూడా మద్దుతుగా నిలవగా నేను ఆటను సీరియస్‌గా తీసుకున్నా.
#VadodaraCelebrates:World Champion cricketer #RadhaYadav receives hero’s welcome in #Vadodara after India’s Women’s World Cup triumph!A grand roadshow was organised,with thousands of fans turning up to cheer for her! #WomensWorldCup #IndianCricket #VadodaraPride #CricketFever pic.twitter.com/jJZFJvZSny
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 9, 2025
అయితే.. ఇరుగుపొరుగు, బంధువులు మా నాన్నతో మీ కూతురు అబ్బాయిలతో క్రికెట్ ఆడుతోంది. పెళ్లి చేసి పంపకుండా ఆటలు ఆడిస్తున్నావా?’ అని అనేవారు. కానీ, ఆయన వారి మాటలు పట్టించుకోకుండా ‘బిడ్డా.. నువ్వు ఆడు. పెద్ద క్రికెటర్ అవ్వు’ అని ఆశీర్వదించేవారు’ అని వెల్లడించిన రాధ .. 19 ఏళ్ల వయసులో బీసీసీఐ కాంట్రాక్ట్ సాధించింది. అప్పుడు వచ్చిన డబ్బులతో తండ్రికి చిన్న షాపు పెట్టించింది. కూతురిని కొడుకులా పెంచి.. స్వేచ్ఛగా ఎదగనిస్తే కుటుంబానికి అండగా నిలుస్తుందని నమ్మిన రాధ తండ్రి నమ్మకం నిజమైంది. నవంబర్ 2న భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలో చేసుకున్న సంబురాల్లో రాధ తండ్రి ఓం ప్రకాశ్ కూడా పాల్గొన్నారు. కోచ్ అన్మోల్ మజుందార్ ట్రోఫీని అందించగా తలపై పెట్టుకొని చాలా మురిసిపోయారాయన. తన కూతురి విజయాన్ని ఆయన మనసారా ఆస్వాదించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
🏆❤️ Proud Moments: Radha Yadav’s Father Celebrates with the World Cup Trophy!
⁰Witness the heartwarming moment as Radha Yadav’s father celebrates with pure joy, dancing while holding the World Cup Trophy. 🥹✨ pic.twitter.com/MexzAlxvnp— Cricket Pulse 🇬🇧 – Cricket Beyond Boundaries 🏏 (@MSohailAfzal10) November 4, 2025
ముంబై నుంచి క్రికెట్ అవకాశాల కోసం బరోడాకు వెళ్ళిన రాధ అక్కడే రాటుదేలింది. జూనియర్ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టి 2015లో దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసింది. నిలకడగా రాణించడంతో మూడేళ్లతో టీ20ల్లో ఆడే అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్ ఆడిన తను.. 2021లో వన్డే క్యాప్ అందుకుంది. పదమూడో సీజన్ వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపికైన ఈ ముంబై అమ్మాయి ఆడింది మూడు మ్యాచులే. స్నేహ్ రానా (Sneh Rana) స్థానంలో జట్టులోకి వచ్చిన రాధ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3 వికెట్లతో మెరిసింది.
Pin point accuracy! 👏🏻🎯
A direct hit from #RadhaYadav and it’s curtains for #NigarSultana!
Catch the LIVE action ➡ https://t.co/AHK0zZJTc3#CWC25 👉 #INDvBAN | LIVE NOW pic.twitter.com/EERIbN3OhP
— Star Sports (@StarSportsIndia) October 26, 2025
డీవై పాటిల్ మైదానంలో ఆమె బంతిని బాగా స్పిన్ చేయడంతో.. సెమీస్, ఫైనల్లోనూ ఆడించారు. మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లే తీసినా.. సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకుందీ కండీవల్లి క్వీన్. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఆడిన రాధను ఫ్రాంచైజీ వదిలేసింది. దాంతో.. నాలుగో సీజన్ వేలంలో తను భారీ ధర దక్కించుకునే అవకాశాలున్నాయి. ప్రపంచ ఛాంపియన్ జట్టులోని రాధ.. ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఈమధ్యే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా రూ.2.5కోట్ల చెక్కు అందుకుంది.
World Champion Smriti Mandhana, Jamimah Rodrigues and Radha Yadav Meets Maharashtra CM Devendra Fadnavis👌#CMDevendraFadnavis #SmritiMandhana #CWC25 pic.twitter.com/EJQJYO7gO6
— Indian sports (@Indiansports31) November 7, 2025