World Cup Final : వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు శాంతించాడు. డీవై పాటిల్ స్టేడియంలో టాస్కు అడ్డుపడిన వరుణుడు సాయంత్రం 4 తర్వాత తెరిపినివ్వడంతో సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్దం చేశారు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడిన అంపైర్లు.. 50 ఓవర్ల ఆటకు అవకాశముందని చెప్పారు. 4:32 గంటలకు టాస్ వేయనున్నారు. 5 గంటలకు తొలి బంతి పడనుంది.
వన్డే ప్రపంచ కప్ తొలి ఛాంపియన్‌గా అవతరించేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్దమయ్యాయి. వర్షం తగ్గిపోవడంతో డీవై పాటిల్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య కప్ కోసం నువ్వానేనా అన్నట్టు ఫైనల్ పోరు జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఆలస్యమైంది. కాసేపు బ్రేకిచ్చిన వర్షం మరోసారి దంచేయడంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పేశారు సిబ్బంది. దాంతో.. ఈరోజు మ్యాచ్ సాధ్యం అవుతుందా? చివరకు 20 ఓవర్ల ఆట అయినా ఆడిస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి అభిమానుల్లో. ఎట్టకేలకు వర్షం తగ్గడంతో 4:32 గంటలకు టాస్ వేయనున్నారు.
GOOD news finally! The covers are off – setting up for the toss at 4.30 PM 🤞🏽 pic.twitter.com/MPuS4xMs8F
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2025