ODI World Cup 2023 : వరల్డ్ కప్ డబుల్ హెడర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ఆసీస్ మాత్రం స్టోయినిస్, కామెరూన్ గ్రీన్‌లను తీసుకుంది.
నాలుగు విజయాలతో జోరుమీదున్న కమిన్స్ సేన సెమీస్ బెర్తుపై కన్నేయగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బట్లర్ బృందం పరువు కోసం పోరాడనుంది. ఈ మ్యాచ్‌లో కంగారూలు గెలిస్తే.. 10 పాయింట్లతో సెమీస్ రేసులో ముందంజ వేస్తారు.
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్మిత్, లబూషేన్, స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, హేజిల్‌వుడ్.
ఇంగ్లండ్ : జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, మోయిన్ అలీ, మార్క్ వుడ్, విల్లే, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్.